బతిమాలే కథ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరాల శ్రీనివాస్ హీరోగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో కెఆర్ ప్రదీప్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -నాయనా రారా ఇంటికి (ఎన్‌ఆర్‌ఐ). బుధవారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటి అక్కినేని అమల క్లాప్ నివ్వడంతో సినిమా మొదలైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్‌షాట్‌ను బాల రాజశేఖరుని డైరెక్ట్ చేశారు.
సినిమా ప్రారంభోత్సవానికి హీరోలు నాని, సుమంత్, సుశాంత్, నాగశౌర్య, అఖిల్, మంచులక్ష్మి, రచయిత వి విజయేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో దర్శకుడు బాలరాజశేఖరుని మాట్లాడుతూ టైటిల్ సౌండింగ్‌లో ఒక్కో రకమైన ఎక్స్‌ప్రెషన్ పలుకుతుందని, అయితే ఇది ఇంటికి రమ్మని ప్రాధేయపడే సినిమా కాదు, హైలీ ఎనర్జిటిక్ రొమాంటిక్ కామెడీ అన్నారు. తన లైఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వస్తున్న సినిమా కనుక స్ట్రాంగ్‌గా చెప్పే అవకాశమున్నా, ఒక చిలిపి క్యారెక్టర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
అవసరాలను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నానని, తెలుగమ్మాయి అయితేనే బావుంటుందన్న ఉద్దేశంతో మహతిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నామన్నారు. సీతారామశాస్ర్తీ పాటలు అందిస్తుంటే, వాళ్లబ్బాయి యోగేశ్వర శర్మ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడన్నారు. సంగీత దర్శకుడు యోగేశ్వర శర్మ మాట్లాడుతూ దర్శకుడు బాలతో చిన్నప్పటి నుంచి పరిచయముందని, ఆయన చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉందన్నారు.
హీరోయిన్ మహతి ‘తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలన్న తన చిన్ననాటి కల ఈ చిత్రంతో నెరవేరుతుందని’ ఆనందం వ్యక్తం చేసింది. హీరో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘అష్టాచమ్మాకు ముందునుంచే బాల తెలుసు. ఆయన రెండో సినిమా ‘బ్లైండ్ యాంబిషన్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన చేస్తున్న తొలి తెలుగు చిత్రంలో లీడ్ క్యారెక్టర్ చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాతో నిర్మాత ప్రదీప్‌కి లాంగ్‌స్టాండింగ్ ఇండస్ట్రీలో ఉండే సక్సెస్ కోసం నావంతు కృషి చేస్తాను’ అన్నారు. మీడియా సమావేశంలో సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, నటుడు నాగబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్‌కుమార్, నిర్మాత ప్రదీప్ కెఆర్ తదితరులు మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐ చిత్రానికి వెంకట్ సి దిలీఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.