అభిమానమే నా ఆయుష్షు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి, నిర్మాత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు డైరెక్టర్ విజయనిర్మల 74వ పుట్టిన రోజు వేడుక హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఆనందడోలికల మధ్య జరిగింది. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్‌ను కట్ చేసి విజయనిర్మల అభిమానులతో ఆనందం పంచుకున్నారు. వేడుకలో సూపర్‌స్టార్ కృష్ణ, జయసుధ, నరేష్, నిర్మాతలు శాఖమూరి మల్లికార్జున రావు, బిఏ రాజు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. పదిమందికీ సహాయపడే తత్వమున్న విజయనిర్మల ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కృష్ణ ఆకాంక్షించారు. తనను కలుసుకోడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు విజయనిర్మల కృతజ్ఞతలు చెబుతూ, మీ అభిమానమే నా ఆయుష్షు అంటూ వ్యాఖ్యానించారు. ఇంతమందిమధ్య హితుల మధ్య తన పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.