సిరివెన్నెలై వస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రియమణి, ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామసీత నిర్మించనున్న ప్రాజెక్టుతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సిరివెన్నెల టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్ స్పాట్‌లోనే ప్రియమణి ప్రకటించింది. మళ్లీ ఇండస్ట్రీకి వచ్చేందుకు చాలా కథలు విన్నప్పటికీ, ‘ సిరివెన్నెల’ కథలో పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండటంతో ప్రాజెక్టు ఓకే చేశానని చెబుతోంది. ఈ చిత్రంలో సాయి తేజస్విని, బాహుబలి విలన్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్త్న్రం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ సిరివెనె్నల టాకీపార్ట్ పూరె్తైందని, రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయన్నారు. కొంత గ్యాప్ తరువాత థ్రిల్లర్ హారర్ జోనర్ సినిమా చేస్తున్న ప్రియమణి, ఇందులో డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తుందన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అని, నిర్మాతలు కమల్, భాషా, రాంసీతల సహకారం మర్చిపోలేమన్నారు. ప్రియమణి మాట్లాడుతూ చాలారోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. థ్రిల్లర్ జోనరే అయినా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రకాష్ కూల్ డైరెక్టరని, ప్రభాకర్ చాలా రోల్ చేస్తున్నారని అంది. కాలకేయ ప్రభాకర్, నిర్మాత భాషా తదితరులు సినిమా వివరాలు వెల్లడించారు.