మళ్లీ సీక్వెల్స్ సీజన్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ తలుపు మూసుకుపోతే -మరెక్కడో మరో తలుపు తెరుచుకుంటుందన్నది ఆశావాదం.
పరిశ్రమకు సరిగ్గా సరిపోయే పోలిక.

బయోపిక్‌ల ట్రెండ్‌కు సడెన్ బ్రేక్ పడింది. అందుకు కారణాలనేకం. బాలీవుడ్ వరుసపెట్టి వదిలిన బయోపిక్‌లు హిట్లు కొట్టడంతో -అలవాటుగా దక్షిణాది పరిశ్రమ సైతం వాటిపై మోజు పెంచుకుంది. అయితే, ఆడియన్స్ ముందుకొచ్చిన సౌత్ బయోపిక్‌లకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆడియన్స్ పల్స్ పట్టుకున్న తెలివైన నిర్మాతలు -బయోపిక్ బౌండు స్క్రిప్ట్‌ల్ని మడతపెట్టి మూలన పెట్టేశారు. ఎదురుదెబ్బలు తగిలినా -అలవాటైన ‘లోకల్ ట్రెండే’ బెటరన్న యోచనకు వస్తున్నారు. అందుకే -సీక్వెల్స్ సౌండ్స్ మళ్లీ గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి టాలీవుడ్‌లో సెనే్సషన్ క్రియేట్ చేసిన సీక్వెల్స్ సీక్వెన్స్ పెద్దదేంకాదు. కంటిన్యుటీ కథ అని చెప్పలేకున్నా -ఒకటో రెండో మాత్రమే ‘సరే’ అనిపించుకున్నాయి. అయినా -‘చక్కగా అనుష్టించబడిన పరధర్మం కంటే, విలువలేనిదైన స్వధర్మమే మేల’న్న గీత సారంవైపే మొగ్గు కనిపిస్తోంది. సో -బయోపిక్‌లకంటే సీక్వెల్సే బెటరన్నది ఇండస్ట్రీ లేటెస్ట్ టాక్.

సోనాలి బింద్రే, అన్షులతో చేసిన అక్కినేని నాగార్జున డైలాగింగ్ మూవీ -మన్మధుడు. నాగ్ పంచ్‌లు, బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్లు, ధర్మవరపు సెటైర్లు, దేవీశ్రీ పదనిసలు -వెరసి మ్యాజిక్ క్రియేటైంది. అప్పటినుంచి ఎప్పటికీ మన్మధుడినేనని సరదాగా చెప్పే కింగ్ నాగార్జున -ఇప్పుడు మరో మన్మధుడుని ఆడియన్స్ ముందుకు తేనున్నాడు. నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్‌ను చక్కబెడుతున్నాడు. ‘మజ్ను’ టు ‘మిస్టర్ మజ్ను’ అన్నట్టు ‘మన్మధుడు’ నుంచి ‘మన్మధుడు-2’ని అఖిలి చేస్తాడా? లేక ఆ చాన్స్ చైతూకి ఇస్తాడా? అన్నది వేచి చూడాలి. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోవున్న ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుందట. ఏమో చివరి క్షణంలో నాగార్జునే -‘మిస్టర్ మన్మధుడు’ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఢీ’కొట్టక తప్పదు
కొద్దికాలం ఇండస్ట్రీలో మనగలగాలంటే -రేసులో దూసుకుపోతున్న వాళ్లను ఢీ’కొట్టక తప్పని పరిస్థితి శ్రీను వైట్లది. అందుకే పుష్కరకాలం క్రితంనాటి హిట్టును చరిత్రపుటల్లోంచి బయటకు లాగుతున్నాడట. 2007లో సెనే్సషన్ సృష్టించిన ‘్ఢ’కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో గ్రేట్ రిజల్ట్ అందుకున్నాడు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తే, శ్రీహరి కీలక పాత్రతో మెప్పించాడు. అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా విష్ణు కెరీర్‌లో ఇప్పటికీ బిగ్గెస్ట్ హిట్టే. ఢీ నుంచే శ్రీను వైట్ల విజయ పరంపరా మొదలైంది. ఆ హిస్టరీని రిపీట్ చేసే ఆలోచనతో ఉన్నాడట శ్రీను వైట్ల. సినిమాలో మంచు విష్ణుతోపాటుగా మరో యువ హీరో కూడా నటించొచ్చని వినికిడి. ప్రస్తుతానికి డిస్కషన్స్ స్టేజ్‌లోవున్న ప్రాజెక్టు వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. శ్రీనువైట్ల -మంచు విష్ణు ఇద్దరూ వరస పరాజయాలతో సతమతం అవుతున్నారు. మరి ఈ క్రేజీ సీక్వెల్‌తోనైనా మెయిన్ స్ట్రీంలోకి రాగలుగుతారేమో చూడాలి.
యూని’్ఫంలోకి..
పోలీస్ కథల రొటీన్ ఫార్ములాకు ట్రెండ్ టచ్ ఇచ్చాడు దర్శకుడు గౌతమ్‌మీనన్. 2003లో సూర్య- జ్యోతికలతో చేసిన ‘కాక కాక’ బ్లాక్ బస్టరైంది. యూని’్ఫం స్టోరీకి కొత్త ఫార్ములా క్రియేట్ చేసింది. దీన్ని విక్టరీ వెంకటేష్ హీరోగా గౌతమ్‌మీననే తెలుగులోనూ రీమేక్ చేశాడు. అఫ్‌కోర్స్, అది యావరేజ్. దీనే్న ఫాలో అవుతూ తర్వాత చాలా పోలీస్ కథలే స్క్రీన్‌కు ఎక్కాయి. కానీ ‘కాక కాక’ రేంజ్ వేరు. ఇన్నాళ్లకు దీని సీక్వెల్‌కు ఆలోచన జరుగుతోందని కోలీవుడ్ టాక్. గౌతమ్ ఇప్పటికే దీనిపై చర్చలు మొదలెట్టాడు. ప్రస్తుతం ఎన్‌జికె (నందగోపాలకృష్ణ), కాప్పన్ షూటింగ్‌లతో బిజీగావున్న సూర్య, అవి పూర్తయ్యాక దీనిగురించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు.
పుకార్లుదాటి..
1996లో కమల్, శంకర్ కలిసి ఓ పేట్రియాటిక్ ప్రాజెక్టును ఆడియన్స్ ముందుకితెచ్చారు. అదే భారతీయుడు. 23ఏళ్ల క్రితంనాటి సెనే్సషనల్ హిట్టును సీక్వెల్‌తో గుర్తు చేయడానికి మొదలెట్టిన మరో ప్రాజెక్టే భారతీయుడు-2. శంకర్ సినిమా అంటేనే బడ్జెట్‌మీద సాము. 300 కోట్లతో శంకర్ గీసిన ప్రాజెక్టు బ్లూప్రింట్‌పై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఏకాభిప్రాయానికి రాలేకపోయిందన్న కథనాలు గుప్పుమన్నాయి. సో, భారతీయుడు-2 ఆగిపోయినట్టేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అవన్నీ ఫుకార్లేనంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొట్టిపారేయడమే కాదు, షెడ్యూల్స్ చకచకా సాగిపోతున్నాయంటూ ప్రకటించారు. అంటే -లంచగొండుల భరతం పట్టే భారతీయుడు వస్తున్నాడన్న మాట. కమల్ అప్పియరెన్స్‌తోనే ఆసక్తి పెంచేసిన శంకర్, ఈసారి ఎవరిపై పగపట్టిస్తాడన్నది ఆయనే చెప్పాలి. కమల్‌తో కాజల్ జోడీకడుతుంటే -అనిరుథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
అంతేగా..
ఒక సినిమా హిట్టే సీక్వెల్‌కు నాంది.. అంతేగా అంతేగా అంటూ మళ్లీ కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అయిపోయాడు అనిల్ రావిపూడి. ‘మల్టీ కామెడీ’తో సంక్రాంతి విందుచేసిన కుర్ర దర్శకుడు ‘మూడో ఎఫ్’కు ఏం అర్థం చెబుతాడోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో మొదలైంది. వెంకటేష్, వరుణ్‌తేజ్.. మధ్యలో రవితేజను తీసుకొచ్చి సీక్వెల్ స్టేటస్ పెంచేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నాడట. ‘సినిమాకు సీక్వెల్స్ ఉంటాయి’ అంటూ సక్సెస్ కొనసాగింపు డైలాగ్ చెప్పిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్-3’ చిత్రీకరణను 2020లో మొదలెడతాడని అంటున్నారు. అదే ఏడాది చివర్లోనో, ఆపై ఏడాది సంక్రాంతి వినోదంగానో ఈ సినిమా రావచ్చన్న మాట.
ఇదీ అసలు నిజం
గూఢచారి సినిమాలో సాఫిస్టికేటెడ్ స్పై క్యారెక్టర్‌తో సినిమాకు ప్రాణం పోసిన సుప్రియను ఆ చిత్రం హీరో అడవి శేష్ పెళ్లాడబోతున్నాడట. సోషల్ మీడియా కథనమిది. దీనికి శేష్ కౌంటరిస్తూ -‘కొద్దికాలంపాటు సినిమాతోనే కాపురం చేస్తాను. గూఢచారి-2 ప్రాజెక్టుపై తీరికలేకుండా ఉన్నాను. ఇదీ అసలు నిజం’ అంటూ చమత్కరిస్తున్నాడట. ఔను మరి -స్పై థ్రిల్లర్‌తో ఊహించని విజయం అందుకున్న శేష్, కొద్ది నెలల క్రితమే సీక్వెల్‌ను ప్రకటించేశాడు. ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయిన డిటెక్టివ్ స్టోరీని స్క్రీన్‌మీదకు తెచ్చి హిట్టుకొట్టిన శేష్ -వచ్చే ఏడాదిలో మరో గూడఛారిగా కనిపిస్తాడట. ప్రాజెక్టు వివరాలు ఇంతవరకూ బయటకు పొక్కకపోయినా -సైలెంట్ ఆపరైషన్ సాగుతోందన్నది ఇండస్ట్రీ టాక్. సో, ఈ సీక్వెల్‌పైనా ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక -మహేష్‌తో దూకుడు సీక్వెల్ కూడా లైన్‌లో ఉందని సమాచారం. అలాగే ఎప్పటినుండో మెగాస్టార్ క్లాసికల్ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని రామ్‌చరణ్‌తో రీమేక్ చేయాలన్న కోరికనూ ఆమధ్య బయటపెట్టాడు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. మొత్తానికి పలు తెలుగు సినిమాలకు సీక్వెల్స్ తెచ్చే పనిలో బిజీ అయిపోతున్నారు మేకర్లు.
వాళ్లేం తక్కువా..
బాలీవుడ్‌లోనూ సిరీస్‌లు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగులో ‘వర్షం’కు రీమేక్ చేసి ‘బాఘి’గా బ్లాక్‌బస్టర్ హిట్టందుకున్న టైగర్ ష్రాప్, ‘క్షణం’ రీమేక్‌గా ‘బాఘి-2’ హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ‘బాఘి-3’ ప్రాజెక్టులో టైగర్ తలమునకలై ఉన్నాడు. సీక్వెల్స్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అజయ్ దేవ్‌గణ్ ‘టోటల్ ధమాల్’ మూడో పార్ట్ ప్రేక్షకుల ముందుకొస్తుంటే, వరుస విజయాలతో దూసుకుపోతున్న హౌస్‌ఫుల్-4కు అక్షయ్ కుమార్ రెడీ అయిపోయాడు.

-శ్రీనివాస్ ఆర్ రావ్