రజినీతో నయన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే ‘పేట’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్‌స్టార్ రజినీకాంత్, తరువాతి చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్‌తో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టులో తలైవా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి అనిరుద్ రవీంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఇక చిత్రంలో రజినీకి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతారను తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు నయన్, రజినీ సరసన ‘చంద్రముఖి, ‘కథానాయకుడు’ చిత్రంలో నటించగా, శివాజీలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇదిలాఉంటే ప్రస్తుతం నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. మరి మరోసారి రజినీతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.