మొదలైన వాల్మీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన టాలెంట్‌ను చూపిస్తోన్న వరుణ్‌తేజ్ కొత్త ప్రాజెక్టు మొదలైంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. ‘డిజె -దువ్వాడ జగన్నాథం’ తరువాత హరీశ్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కక పోవడంతో మరో సినిమాకు ఆయనకు బాగా గ్యాప్ వచ్చింది. దీంతో తమిళంలో సూపర్ హిట్ అనిపించుకున్న ‘జిగర్తాండ’ చిత్రాన్ని తెలుగు రీమేక్ ప్రాజెక్టుగా తెస్తున్నాడు. ఈ చిత్రానికి వాల్మీకి’ టైటిల్ నిర్ణయించటం తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టులోకి వరుణ్ తేజ్ వస్తే -మరో హీరోగా అథర్వ మురళిని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రాజెక్టు షూటింగ్ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటున్న వరుణ్ -మొన్న ఫిదాతో, నిన్న ఎఫ్-2తో సూపర్ హిట్లు అందుకున్నాడు. మధ్యలో చేసిన ‘అంతరిక్షం’ యావరేజ్ టాక్ వచ్చినా -తన కెరీర్‌లో సైంటిఫిక్ చిత్రం చేశానన్న సంతృప్తి అతనికి మిగిలింది. ఇప్పుడు ‘వాల్మీకి’లో వరుణ్ ఎలా కనిపిస్తాడో చూడాలి.