11న 24 ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథానాయకుడిగా గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్, స్టూడియో గ్రీన్ పతాకాలపై విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 11న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, వేసవి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అద్భుతమైన బాణీలు సినిమా కథకు హైలెట్‌గా వుంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుపుతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నిత్యామీనన్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:తిరునావుక్కరసు, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, పాటలు: చంద్రబోస్, శశాంక్ వెనె్నలకంటి, నిర్మాత:సూర్య, రచన, దర్శకత్వం:విక్రం కె.కుమార్.