వావ్.. టుస్సాడ్స్ సూపర్‌స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ సంస్థ మార్చి 25న హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. తమ అభిమాన హీరో ప్రతిమతో అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తర్వాత మహేష్ మైనపు ప్రతిమను ఐఫా ఉత్సవాల్లో భాగంగా మేడం టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘మేడం టుస్సాడ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు ఏర్పాటుచేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు అనుభూతిని కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ ‘ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతిమ తయారీకి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు ఇవ్వడానికి నాలుగుగంటలు పట్టింది. అభిమానుల్లాగే నేనూ మేడం టుస్సాడ్స్ ఏర్పాటు చేయబోయే మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నారు.
మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్ ప్రతిమని తయారుచేయడం మాకు లభించిన గౌరవం. భారతదేశం నలుమూలలనుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం’ అన్నారు.