మూడో హీరోయిన్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ వైజాగ్‌లో జరుపుకుంటోంది. మలయాళ సూపర్‌హిట్ ప్రేమమ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30 నుండి షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్‌లు నటిస్తున్నారు. మరో హీరోయిన్‌కోసం అనే్వషణ జరుగుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. తాజా సమాచారం ప్రకారం మూడో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ఈషాశర్మను తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడా స్థానంలో అందాల భామ రెజీనా చేరింది. ఈ పాత్ర కోసం ఈషా కంటే కూడా రెజీనా బాగుంటుందని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. రెజీనా ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘సౌఖ్యం’ చిత్రంలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందే ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.