పూర్తికావస్తున్న మయసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన తారాగణంగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో వుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తున్నామని, ఖమ్మం, కృష్ణాజిల్లా మైలవరం, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశామని తెలిపారు. నాలుగు పాటలతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. చింటూ, జూ.రేలంగి, షకలక శంకర్, రాఘవ, రమణారెడ్డి, వెంకట్, దేవ, కోటయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సాకేత్, పాటలు:శ్రీమాన్, కాసర్ల శ్యామ్, కెమెరా:గోపి కాకర్ల, కథ, దర్శకత్వం:నెప్పలి కృష్ణ.