అహంలో లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దికాలంగా సరైన హిట్‌కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న దర్శకుడు తేజ, తాజగా ‘అహం’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఆయన స్క్రిప్ట్ దగ్గర్నుంచే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో ప్రముఖ హీరో రాజశేఖర్ నటించనున్నారని కొద్దిరోజుల క్రితమే ప్రకటించగా, తాజాగా ఈ ప్రాజెక్టునుంచి ఆయన బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్ ఈ ప్రాజెక్టునుంచి బయటకు రావడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి వుంది. ప్రస్తుతం తేజ ఇదే పాత్రకు మరో స్టార్ హీరోని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాతో తేజ మళ్లీ తానేంటో నిరూపించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఎప్పట్లాగే ఈ సినిమాలో పలు కీలక పాత్రల కోసం కొత్తవారిని ఎంపిక చేస్తోన్న తేజ, త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నారు.