వెనక్కి జరిగిన జెర్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీ విడుదల తేదీ వెనక్కి జరిగింది. హై టెక్నికల్ వాల్యూస్‌తో వస్తున్న మహేష్‌బాబు చిత్రం ‘మహర్షి’ విడుదల తేదీ మారడంతో -అందుకనుగుణంగా ముందూ వెనుక రానున్న చిత్రాల తేదీలు కూడా మారుతున్నాయి. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా పూరె్తైన విషయం తెలిసిందే. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన సినిమాలో నాని క్రికెటర్ పాత్ర పోషించాడు. శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికగా నటించిన సినిమాను వాస్తవానికి ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు. అదే రోజున భారీ అంచనాలతో వస్తున్న చైతూ-సమంతల చిత్రం ‘మజిలీ’ కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే, నిర్మాణ పనులు పూర్తికాకపోవడం, కొన్ని సెంటిమెంట్ల కారణంగా ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సిన మహర్షి చిత్రం -మే 9కి జరిగింది. దీంతో ఏప్రిల్ 5 నుంచి మే 9 మధ్యలో సోలో స్లాట్లు దొరకడంతో -జెర్సీ చిత్రాన్ని సోలో స్లాట్‌కు మార్చుకున్నట్టు సమాచారం. దీంతో ఏప్రిల్ 19న థియేటర్లకు తెచ్చేందుకు నిర్మాతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీంతో ‘మహర్షి’ చిత్రానికి ముందుకు అటు మజిలీ, ఇటు జెర్సీ సోలో స్లాట్లలో థియేటర్లకు వచ్చే అవకాశం దక్కినట్టైంది.