పాటే నాకు పద్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ గీత రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం బుధవారం హైదరాబాద్‌లో సిరివెనె్నలని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సిరివెనె్నల సీతారామశాస్ర్తీ మాట్లాడుతూ కళలో సాహిత్యమనేది అనేక రూపాలుగా ఉంటుంది. అందులో విశిష్టమైనది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా. సినిమాకి ఔన్నత్యం ఎంత అనేది ప్రశ్నించరానిది. సమాజాన్ని నిలువెత్తు అద్దంలా చూపిస్తుంది సినిమా తెర. సినిమా అంత గొప్పది కాబట్టే నేను సినిమా రంగాన్ని దేవాలయంగా భావిస్తాను. నా మాట పద్మమై పుట్టాలనే తపనతోనే ప్రతి పాటనీ రాస్తుంటాను. అమ్మవారులందరికీ పాదపీఠం పద్మమే కాబట్టి వాళ్లందరి ఆశీస్సులతోనే ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా రాస్తున్నాను. సినిమా పాట రాయడమంటే తేలిక అనుకుంటారు చాలామంది. వైవీఎస్ చౌదరి ఒక సినిమా కోసం రామాయణాన్ని ఒక పాట రూపంలో చెప్పండన్నారు. అదొక సవాల్. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే పాట రాశాను. గౌరవాన్ని పొందాను. పాట ద్వారా భావాన్ని వ్యక్తంచేయాలి. అందుకోసం నాకు సంతృప్తి లభించేవరకు రాస్తూనే ఉంటాను. భవిష్యత్‌లో మరిన్ని మంచి పాటలు రాస్తానన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు బాగా పరిచయమైన రచయిత శ్రీశ్రీ. తర్వాత వేటూరి, సిరివెనె్నలలే. భావోద్వేగంతోపాటు భావపూరితమైన పాటలు రాస్తుంటారు ‘సిరివెనె్నల’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘జగమంత కుటుంబం నాది’ అని పాట రాసిన సిరివెనె్నల రచయితల కుటుంబం మొత్తానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయనకీ, రచయితలకీ మధ్య అన్నదమ్ముల సంబంధం ఉంటుంది. పద్మశ్రీ అనేది తెలుగు సినిమా రంగంలో చాలామంది నటులకి వచ్చింది. దర్శకుల్లో రాజవౌళికి, సాహితీవేత్తల్లో సినారెకీ వచ్చింది. సినీ గీత రచయితగా వచ్చించి మాత్రం సిరివెనె్నలకే’ అన్నారు. కార్యక్రమంలో రచయితలు విజయేంద్రప్రసాద్, బుర్రా సాయిమాధవ్, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్ర్తీ, వెనె్నలకంటి, వడ్డేపల్లి కృష్ణ, గుణ్ణం గంగరాజు, కె.ఎల్.నారాయణ, బలభద్రపాత్రుని రమణి, రామ్‌ప్రసాద్, ఆర్పీపట్నాయక్, రామకృష్ణ ఆకెళ్ళ, వై.వి.ఎస్.చౌదరి, ఉమర్జీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.