ఆమెకోసం... రాజవౌళి.. నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్లు నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. జుహీచావ్లా, పూజాభట్ లాంటి సీనియర్లూ నిర్మాతలుగా సినిమాలు నిర్మించినవారే. తాజాగా ఈ బాటలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ చేరింది. త్వరలోనే అలియాభట్ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తోందట. దానికి ఇప్పటికే ఒక పేరు కూడా ఫిక్స్ చేసినట్టు అలియానే స్వయంగా వెల్లడించింది. ప్రొడక్షన్ హౌస్ పేరు ‘ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్’. ఎలాంటి సినిమాలను అలియా చూడడానికి ఇష్టపడుతుందో అలాంటి సినిమాలనే సంస్థలో నిర్మిస్తానని చెబుతోంది. తన అక్క పూజాభట్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది. మరి అదే బాటలో చెల్లి కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి. అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, కళంక్ సినిమాల్లో నటిస్తోంది. ఇక పర్సనల్ లైఫ్‌లో బాలీవుడ్ కాసనోవగా పేరుతెచ్చుకున్న రణబీర్‌కపూర్ ప్రేమలో పీకల్లోతుల్లో మునిగిపోయి ఉందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ షూటింగైతే జరుగుతోంది కానీ, హీరోయిన్ల సంగతే ఎటూ తేలడంలేదు. రాజవౌళి మాత్రం పాత హీరోయిన్లు కాకుండా ప్రెష్ బ్యూటీస్ కోసమే ట్రై చేస్తున్నాడట. అందులో మొదటి పేరు రాజ్ సుందరి అలియాభట్ ఉందనే టాక్ కొద్దిరోజుల క్రితమే వచ్చింది. తన డేట్స్ కోసం జక్కన్న రకరకాలుగా ట్రై చేస్తున్నట్టు సమాచారం. తనను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు బాహుబలి హిందీ వర్షన్ నిర్మాత కరణ్ జోహార్ ద్వారా మధ్యవర్తిత్వం చేయిస్తున్నా రెస్పాన్స్ వెంటనే రావడం లేదని టాక్. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఆలియాభట్ బాలీవుడ్‌లోనే భారీ ప్రాజెక్ట్స్‌లో చిక్కుకుపోయింది. వాటికే ఈ ఏడాది మొత్తం సరిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌ఆర్‌ఆర్ ఎంత వదలకూడని సినిమానే అయినప్పటికీ తక్కువ డేట్స్‌తో జరిగే పని కాదు కాబట్టి అయోమయంలో వున్నట్టు సమాచారం.