వీడే.. డియర్ కామ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీత గోవిందం -బ్లాక్‌బస్టర్. టాక్సీవాలా -కమర్షియల్ హిట్టు. ఆ రెండు ఫలితాలతో విజయ్ దేవరకొండ మంచి ఊపుమీదున్నాడు. మరోసారి రష్మిక మండన్నతో కలిసి యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండ చేస్తున్న తాజా చిత్రం -డియర్ కామ్రేడ్. ఈ చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంది. గాలి కూడా చొరబడనంత దగ్గరగా హత్తుకున్న రష్మిక, విజయ్‌ల లుక్ ఆకట్టుకుంటోంది. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ కలిపి నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ ప్రకటించేశాడు కూడా. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. చిత్ర నిర్మాణం ముగింపు దశకు చేరడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ శరవేగంగా నిర్వహిస్తున్నారు. మెడికల్ స్టూడెంట్‌గా విజయ్ దేవరకొండ, క్రికెటర్‌గా రష్మిక మండన భిన్నమైన పాత్రలు పోషిస్తుంటే -వాళ్లిద్దరి మధ్య వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 22న విడుదల చేయనున్న చిత్రానికి సంబంధించి ఈ 17న టీజర్ విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్లు నిర్ణయించినట్టు సమాచారం.