కంటెంట్‌పై నమ్మకంతో.. ప్రేమకథా చిత్రమ్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం-3గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్-2. హరికిషన్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధిఇద్నాని జంటగా నటిస్తున్న చిత్రంలో నందిత శే్వత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆర్ సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ప్రేమకథాచిత్రం-2’ షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 6న విడుదల చేయనున్న నేపథ్యంలో దర్శకుడు మాట్లాడుతూ సినిమా చాలాకష్టపడి తీశాం. ఫస్ట్‌పార్ట్‌కి ఏమాత్రం తీసిపోదు. అందుకు ప్రొడ్యూసర్ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు బాగా కుదిరాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.
హీరో మాట్లాడుతూ అందరూ చాలా హార్డ్‌వర్క్ చేశాం. సప్తగిరి లేడా? అని చాలామంది అడిగారు. ఆయన చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చెయ్యడం హ్యాపీగా ఉంది. అందరికంటే ముఖ్యంగా మా డీవోపీతో వర్క్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఫ్రేమ్ చాలాబాగా చూపించారు. దర్శకుడు హరి క్లయిమాక్స్‌ను మెచ్యూర్డ్‌గా తెరకెక్కించారు అన్నారు. ప్రొడ్యూసర్ సుదర్శన్ మాట్లాడుతూ కంటెంట్‌ని నమ్మి సినిమా తియ్యడానికి ముందుకొచ్చాను. హరి డెబ్యూ డైరెక్టరే కాని బాగా తీశాడు. సాంగ్స్ బాగా వచ్చాయి. సుమంత్ అశ్విన్ గతంలో చేసిన మూవీస్‌కంటే ఈ మూవీ మంచి హిట్‌నిస్తుంది. తన కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఇదిలావుంటే, చిన్న సినిమాగా వచ్చి సెనే్సషన్ సృష్టించిన ప్రేమకథా చిత్రమ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ప్రేమకథా చిత్రమ్-2 ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల కానె్సప్ట్‌లో హీరో క్రైసిస్‌ను కథా వస్తువుగా తీసుకున్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సుమంత్, నందిత ప్రేమికులు. సిద్ధి ఇద్నానీనీ ప్రేమిస్తాడు. ఆ విషయం నందితకు తెలుస్తుంది. తరువాత జరిగిన కథలో నందిత ఎందుకు దెయ్యంలా మారిందన్నదే ఆసక్తికర అంశం. హారర్ జోనర్‌లో కొరియన్ స్క్రీన్స్ మీద ఇలాంటి ట్రయాంగిల్ కథలు చాలానే వచ్చాయి. అలాంటి కంటెంట్‌తో వస్తున్న తెలుగు సినిమా -ప్రేమకథా చిత్రమ్ ఎలాంటి ఇపాంక్ట్ చూపిస్తుందో చూద్దాం.