కథ నచ్చితేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా ఇచ్చిన విజయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఆ సినిమా తరువాత దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ భామ, అందరూ స్టార్ హీరోల సరసన నటిస్తుండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్, రామ్‌చరణ్‌ల సరసన నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాల్లో నటిస్తోన్న రకుల్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా తనకు, తన కెరీర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలపైనే దృష్టిపెట్టిందట. దానికోసం ముందుగా కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తానని గట్టిగానే చెబుతోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్-గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో కథ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తోందట. మరోవైపు గ్లామర్‌కే కాకుండా నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో నటించాలని అంటోంది రకుల్.