ఏప్రిల్ 19న జెర్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం -జెర్సీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. చిత్రం గురించి దర్శకుడు తిన్ననూరి మాట్లాడుతూ ‘జెర్సీ సినిమాగానే కాదు, మనసుకు నచ్చిన కథ. విడుదల తరువాత అదే ఫీలింగ్ అందరికీ కలుగుతుందన్న నమ్మకంతో ఉన్నా. 36ఏళ్ల వయసులో కల సాకారం చేసుకోడానికి అర్జున్ అనే కుర్రాడు ఎలా ప్రయత్నించాడో ఇందులో చూపించాం. సినిమా చూసిన తరువాత ‘జెర్సీ’ అన్న టైటిల్‌లోని భావం అందరికీ అర్థమవుతుంది. పాత్రోచిత పెర్ఫార్మెన్స్‌తో సినిమాను హైట్స్‌కు తీసుకెళ్లిన నానికి, అందుకు అన్నివిధాల సహకరించిన నిర్మిత నాగవంశకి కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత నాగవంశి మాట్లాడుతూ జెర్సీ నిర్మాణానంతర పనుల్లో ఉంది. మా బ్యానర్‌లో ప్రత్యేకంగానిలిచిపోయే సినిమా ఇది. నాని, శ్రద్ధతోపాటు సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణలు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’ అన్నారు. జెర్సీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తుంటే, సాను జాన్ వర్గీస్ కెమెరా సహకారం అందించారు.