మా లీడర్ నరేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడిన శివాజీరాజా(199)పై నరేష్ (268) 69 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్, కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. మా కోశాధికారిగా రాజీవ్ కనకాల, సంయుక్త కార్యదర్శులుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన హేమ విజయం సాధించటం గమనార్హం.
కమిటీ కార్యవర్గ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి, అనితాచౌదరి, అశోక్‌కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజారవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి నరేష్, శివాజీరాజా ఆధ్వర్యంలోని ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ‘మా’ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లుంటే, 472మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలవ్వడం ఇదే ప్రథమం. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటు నరేష్ వేస్తే, చివరి ఓటును చిట్టిబాబు వేశారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి బ్యాలెట్ ప్రాతిపదికన సాగిన ఎన్నికల సరళిలో, ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.