ఉపేంద్ర ఐ లవ్ యు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన తాజాచిత్రం ఐ లవ్ యు. -ననే్న ప్రేమించు అనేది క్యాప్షన్. రచితారామ్ హీరోయిన్. శ్రీ సిద్దేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్ చంద్రు దర్శకత్వంలో నిర్మించారు. హైదరాబాద్‌లో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ఉపేంద్ర కోసమే వచ్చాను. నా చేతులమీదుగా మోషన్ పోస్టర్ విడుదల చేయడం వెరీ హ్యాపీ. తెలుగు, కన్నడలో మంచి విజయం చేకూరాలని ఆశిస్తున్నా అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్‌స్పైర్ అవుతున్నా. తెలుగులో చాలా బ్లాక్‌బస్టర్ సినిమాలు చేశారు. మీనుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇపుడు నేను కొంచెం స్ఫూర్తి తీసుకుంటున్నా. థియేటర్ నుంచి బయటకు వెళ్లాక సినిమా గురించి మాట్లాడాలంటే ప్రతి సన్నివేశం, మలుపు బావుండాలని ఆలోచించడానికి జీరోనే కారణమైంది. ఐ లవ్ యు సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయి. సినిమా క్రెడిట్ అంతా దర్శకుడిదే అన్నారు. చిత్ర దర్శకుడు ఆర్ చంద్రు మాట్లాడుతూ తెలుగులో ఈ సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. లగడపాటి శ్రీ్ధర్‌కి రుణపడి ఉంటాను. ఐ లవ్ యు నా కెరీర్‌లో 11వ సినిమా. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఐ లవ్ యు ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెబుతున్నాం? అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ఇది అన్నారు. కార్యక్రమంలో లగడపాటి శ్రీ్ధర్ తదితరులు మాట్లాడారు.