మౌనమే ఇష్టమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్ట్ డైరెక్టర్‌గా దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి నంది అవార్డులు గెలుచుకున్న అశోక్‌కుమార్ దర్శకత్వంలో ఎకె మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం ‘
మౌనమే ఇష్టం’. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్, రీతూ వర్మ హీరో హీరోయిన్లు. వివేక్ మహదేవా సంగీతం అందించారు. ఆడియో ఇటీవలే విడుదలైంది. మార్చి 15న సినిమా విడుదల సందర్భంగా హీరో సాయి కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అశోక్‌కుమార్ సినిమాను తెరకెక్కించారన్నారు. ప్రతి ప్రేమికుడి ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బందైతే ఆ ప్రేమికుడు పడే బాధ ఏమిటో సినిమాలో చూపించడం జరిగిందన్నారు. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అశోక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ దర్శకుడు అశోక్ ఈ సినిమాను వండర్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రామ్‌తులసి ఫొటోగ్రఫీ చాలా బాగుంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్ సినిమా అవుతుందన్నారు. దర్శకుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్‌స్టోరీ. ఎలా ప్రపోజ్ చేయాలన్నదే సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. పార్వతి మంచి పెర్‌ఫార్మర్. రీతూ క్యారెక్టర్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా మార్చి 15న విడుదలవుతుందన్నారు. నటి ప్రియాంక, సినిమాటోగ్రాఫర్ రామ్ తులసి తదితరులు ప్రసంగించారు.