దసరా రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్‌రాజ రవితేజ తాజా చిత్రం డిస్కోరాజా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివరాత్రి రోజన మొదలుపెట్టిన షూటింగ్‌ను పక్కా ప్లాన్‌తో పూర్తి చేస్తున్నారు. రవితేజ ఇప్పటివరకు టచ్‌చేయని జానర్‌లో సినిమా తెరకెక్కుతోందట. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి దసరాకు సినిమా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ‘వినూత్న అంశాన్ని సినిమా కథాంశంగా తీసుకున్నాం. బ్యానర్ వాల్యూని మరింత పెంచేలా సినిమాని భారీగా నిర్మిస్తున్నాం. హైదరాబాద్ సహా గోవా, చెన్నై, లడఖ్ మనాలీతోపాటు ఉత్తర భారతదేశంలోనూ కొన్నిచోట్ల సినిమా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర నిర్మాత చెబుతున్నారు. డిస్కో రాజాకు థమన్ స్వరాలు అందిస్తున్నారు.