బీచ్.. ఓ బడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ గాళ్ అమలాపాల్‌కి ఎప్పుడెలా ఉండాలో, ఎలా ఉండకూడదో బాగా తెలిసినట్టుంది. అందుకే కావలసినప్పుడో, అవసరంమేరకో లైమ్‌లైట్‌లోకి వచ్చి ఒకింత హంగామా చేస్తుంది. ఈ డస్కీ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో హాట్ బీచ్ ఫొటోలు పోస్ట్ చేసింది. మైనా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీఇచ్చిన అమల, తెలుగులో రామ్‌చరణ్, అల్లు అర్జున్ సరసన నటించింది. తర్వాత కొన్ని అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇపుడు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. బీచ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ప్రశ్న ఎలాంటిదైనా సరే దానికి బీచ్‌లో దొరుకుతుంది. బీచ్ పాఠశాలలాంటిది. అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తుంది. నాకు ఇబ్బందులు ఎదురైనప్పుడు -జీవితంలో మూడేళ్ల ముందు నీ పరిస్థితేంటి? అని ఆలోచిస్తాను. దాంతో ఇప్పుడున్న పరిస్థితికి సరైన సమాధానాలు దొరుకుతాయి’ అంటోంది తెలివిగా. మూడేళ్ల క్రితం దర్శకుడు విజయ్‌తో అమలాపాల్ విడాకులు తీసుకున్నా, ఆమె ట్రావెలింగ్, ట్రెక్కింగ్, బీచ్‌లో స్కైడైవ్స్‌మీద ఇష్టాన్ని పెంచుకుంది.