వైవిధ్యం కోసం.. తపన పడతాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో కెవి గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన చిత్రం 118. మార్చి 1న విడుదలైన చిత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. చిత్ర నిర్మాత మహేష్ కోనేరు బుధవారం మీడియాతో ముచ్చటించారు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో వచ్చిన సినిమాకు ఆడియెన్స్ మంచి సక్సెస్ ఇచ్చారు. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో మంచి థ్రిల్లింగ్ సినిమాగా 118 నిలిచింది. గుహన్ చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌లో చేస్తానని చెప్పగానే ఆయన సరే అన్నారు. నా నువ్వే సినిమాకు రెండో నిర్మాతగా ఉన్నాను. ఆ సినిమా ఆశించిన ఫలితమివ్వలేదు. ఎలాగైనా మంచి సినిమా చేయాలన్న ఆలోచనతో వున్నపుడు గుహన్ ఈ కథ చెప్పారు. ఇపుడు దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. సోలో నిర్మాతగా ఇది నా మొదటి ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన కళ్యాణ్‌రామ్, గుహన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు ఫస్ట్ ధైర్యాన్నిచ్చిన తారక్‌కు థాంక్స్. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్‌తో హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో ఓ సినిమా మొదలుపెట్టాం. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలుపెట్టి, తరువాత అమెరికాలో షూట్ చేస్తాం. దాంతోపాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. అలాగే నేను, ఆయన కలిసి నిర్మాతలుగా కొత్త దర్శకులను, కొత్త కొత్త కథలను పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా మొదలు కానుంది. ఇకపై ఈ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. నాకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తూ తమ సొంతవాడిగా చూసుకుంటున్న ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకు థాంక్స్. ఇక తారక్‌తో సినిమా ఎప్పుడని అందరూ అడుగుతున్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అంటూ ముగించారు.