హల్‌చల్ చేస్తారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రుద్రా, ధన్య బాలకృష్ణ నటీ నటులుగా తెరకెక్కిన చిత్రం -హల్‌చల్. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గణేష్ కొల్లురి మాట్లాడుతూ -క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘హల్‌చల్’ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. సెన్సార్‌కి సిద్ధమైన సినిమా బాగా వచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాలూ పూర్తయ్యాయి. రుద్రా, ధన్యబాలకృష్ణ చక్కగా నటించారు. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకముంది. మంచి టెక్నీషియన్స్ సినిమాకు పనిచేశారు. దర్శకుడు శ్రీపతి అనుకున్న ప్లానింగ్, బడ్జెట్‌లో సినిమాను పూర్తిచేశాడు. హనుమాన్, భరత్ సంగీతం అందించిన సినిమాకి రాజ్‌తోట కెమెరా వర్క్ అందించారు. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.