నాన్న తీయాలనుకున్న కథ శాతకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా తన తండ్రి ఎన్టీఆర్ ఓ సినిమా రూపొందిచాలనుకున్నారని, కానీ వీలుపడలేదని, ఇప్పుడు తన వందోచిత్రంగా ‘శాతకర్ణి’ రూపుదిద్దుకోనుందని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా రూపొందిస్తున్నామని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తన వందో చిత్రం ఏదై వుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారని, తెలుగు జాతివారందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి, భారతదేశానంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో తాను నటిస్తున్నానని అన్నారు. ఇటువంటి గొప్ప పాత్రతో వందో చిత్రంగా తాను నటిస్తుండడం అదృష్టమని, తన చిత్రంలో అభిమానులు ఏ ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. నాన్న ఎన్టీఆర్ ఆరునెలలపాటు ఈ స్క్రిప్ట్ కోసం కూర్చున్నారని తనకి తెలిసిందని, ఆయన శాతకర్ణి సినిమా తీయాలనుకున్నారని, అయితే కారణాంతరాలవల్ల ఆ సినిమా రూపొందలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో తనకెవరూ పోటీలేరని, తన సినిమాలే తనకు పోటీ అని ఆయన చెప్పుకున్నారు. 99 సినిమాల కృషి ఫలితంగా వందో సినిమాలో తాను నటిస్తున్నానని ఆయన తెలిపారు. తెలుగు భాష సంస్కృతి ఉన్నతికి కృషిచేసిన గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన సినిమా స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోందని, భారతదేశమే గాదు ప్రపంచమంతా గర్వపడే విధంగా ఈ సినిమా రూపొందనుందని ఆయన వివరించారు. బాలకృష్ణ వందో చిత్రానికి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా వుందని, ఖండఖండాలుగా వున్న భారతాన్ని అఖండ భారతావనిగా చేసిన చక్రవర్తి శాతకర్ణి కథతో, ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథనంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నందుకు గర్వంగా ఉందని దర్శకుడు క్రిష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పాల్గొని శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, క్రిష్ తదితరులు ఉగాది పచ్చడిని రుచి చూశారు.

చిత్రం అమరావతిలో యజ్ఞశ్రీ శాతరర్ణి విగ్రహానికి పూలమాల వేస్తున్న బాలకృష్ణ