ఏప్రిల్ నుండి సైలెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క, మాధవన్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఇంటర్నేషనల్ చిత్రం సైలెన్స్. దాదాపు 100కిపైగా సినిమాల్లో నటించిన కిల్‌బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ్‌సన్ తొలిసారి ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో నిర్మిస్తోంది. ఇతర పాత్రల్లో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సిఇఓ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులందర్నీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే విన్నూత్నమైన సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. యుఎస్‌లోని సియోటెల్‌లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు షూటింగ్ చేయనున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో రూపొందిస్తున్నాం. చిత్ర టీజర్‌ను మేలో యుఎస్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.