దర్శకేంద్రుడి ప్రశంస మర్చిపోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంతటి దిగ్గజడం నా సినిమా వీక్షించి చక్కని ఎమోషన్స్ పండించావని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్రశంస నాలో ఎంతో ఉత్సాహం నింపిందని అంటున్నారు యువ హీరో రామ్ కార్తీక్. ఈ యంగ్ హీరో నటించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, వౌనమే ఇష్టం ఒకేసారి థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. రెండూ ఒకేసారి రిలీజవ్వడంవల్ల ఉల్లాసం నింపితే, అవి రెండూ చక్కని టాక్‌తో విజయవంతంగా రన్ అవడం బోనస్ అని అంటున్నాడు కార్తీక్. ఆ విశేషాలు ఆయన మాటల్లో..
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. సినిమాలంటే ఆసక్తితో నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. తాజాగా నేను నటించిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, వౌనమే ఇష్టం రెండూ ఒకేసారి రిలీజయ్యాయి. ప్రేక్షకులనుంచి చక్కని స్పందన లభించింది. వెంకటలక్ష్మి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఎమోషన్స్‌కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా భయపెట్టే సన్నివేశాలకు జనం బాగా కనెక్టవుతున్నారు. నా పాత్రకు స్పందన బావుంది. ఇక వౌనమే ఇష్టం ఓ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో నా రోల్ యువతరానికి బాగా కనెక్ట్ అవుతోంది. బాగా నటించావని ప్రశంసలు దక్కాయి. నిజాయితీ వున్న ప్రేమకథ ఇది. సీనియర్ కళాదర్శకులు అశోక్ అద్భుతంగా తెరకెక్కించారు. సహజసిద్ధంగా చూపిస్తూనే కమర్షియల్ కోణంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుగారు ఆన్ స్క్రీన్ చాలా ఎత్తుగా కన్పిస్తున్నావ్.. నటన సహజంగా వుంది.. ఎమోషన్ బాగా పండించావ్ అని ప్రశంసించారు. హీరో కాదు ఆ పాత్ర కన్పించింది అని ఆయన అనడం మర్చిపోలేని ప్రశంస. దాంతో నాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. తెలుగు, తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఇకపై విలక్షణమైన పాత్రల్లో నటించాలనుంది. నెగెటివ్ షేడ్ వున్న పాత్రలు అంటే ఇష్టం. ప్రేక్షకులు మెచ్చే కొత్త కథల్ని ఎంచుకుంటాను అంటూ ముగించారు.