వేధించే తల్లిదండ్రుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నరేష్‌కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. విద్య 100% ఉప శీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్, లోగో, టీజర్‌ను ‘మా’అధ్యక్షుడు నరేష్, డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ‘ఒక అద్భుతమైన పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం గొప్ప విషయం. కన్నడలో పెద్ద హిట్టయిన చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయడం మొదటి సక్సెస్‌గా భావిస్తున్నా. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల వంటి దర్శకులు నాకు మంచి పాత్రలను క్రియేట్‌చేస్తున్న తరుణంలో మారుతి, ఇప్పుడు నరేష్‌కుమార్ వంటి యంగ్ డైరెక్టర్స్ కూడా మంచి మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అబ్బాయిలంతా ఇలాంటి తండ్రి ఉండాలనుకునేలా ఫ్యాన్ పెరుగుతుంది. ఇలాంటి సినిమాచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ కన్నడంలో సినిమా హిట్. మంజునాథ్ తెలుగులో తనే నిర్మించాలని కొత్తవాళ్లైనా కూడా సినిమా చేయడానికి ముందుకొచ్చినందుకు ఆయనకు థాంక్స్. నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లలను చదువుకోసం ఎలా వత్తిడి చేస్తున్నారు. పిల్లల మానసిక పరిస్థితేంటి? అనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చూపించారన్నారు. నిర్మాత మంజునాథ మాట్లాడుతూ నేను చిన్నప్పట్నుంచి తెలుగు సినిమాలను ఇష్టపడేవాడిని. ఇప్పుడు తెలుగులో సినిమా ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో తెలుగులో మరిన్ని సినిమాల నిర్మాణానికి నేను సిద్ధం’ అన్నారు. చిత్ర దర్శకుడు నరేష్ వి.కె. మాట్లాడుతూ కన్నడంలో నేనుచేసిన ఫస్ట్ ర్యాంక్ రాజు మా జీవితాలను మార్చేసింది. సినిమా ఏకంగా వంద రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడింది. ఫస్ట్‌ర్యాంక్ స్టూడెంట్ 1శాతం ఉంటే వాళ్ళకే కాదు.. మిగిలిన 99 శాతం పిల్లలకు కూడా నచ్చే సినిమా. కన్నడలో ప్రతి స్టూడెంట్, వారి తల్లిదండ్రులతో చూసిన సినిమా. విద్యేకాదు... బుద్ధి ఉండాలని చెప్పే సినిమా. సినిమాలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మెసేజ్ ఉంటుంది’ అన్నారు.