వరుడి కోసం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్కర కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగువెలిగిన ముద్దుగుమ్మ త్రిష ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడంలేదు. హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. తాజాగా రజినీకాంత్‌తో పెట్ట సినిమాలో నటించింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా కూడా త్రిషకు పెద్దగా ఆ సినిమా మైలేజ్‌ను తీసుకురాలేకపోయింది. దాంతో ఈ అమ్మడి మనసు పెళ్లిపైకి మళ్లినట్లుగా అనిపిస్తుంది. కొన్నాళ్లక్రితమే త్రిష పెళ్లిజరగాల్సి ఉంది. వరుణ్ మణియన్ వ్యాపారవేత్తతో వివాహనిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే కారణం ఏంటో తెలియదు కాని వారి బంధం నిశ్చితార్థంతోనే ముగిసిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయ్యేందుకు త్రిష ప్రయత్నించింది. తాజాగా మరోసారి పెళ్లిగురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు భారత పెళ్లి సంప్రదాయంపై పూర్తి నమ్మకం ఉందని తప్పకుండా పెళ్లిచేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. కచ్చితంగా ప్రేమ వివాహం చేసుకుంటాను అంటూ ప్రకటించిన త్రిష ఇప్పటివరకు తన మనసుకు నచ్చినవాడు నాకు సరైనోడు దొరకలేదని ఆ సరైనోడి కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించింది.