పరారి ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం పరారి. సాయి శివాజీ దర్శకత్వంలో గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. రన్ ఫర్ ఫన్ అనేది ఉప శీర్షిక. యోగేశ్వర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రసాద్‌లాబ్‌లో నిర్మాత సి.కల్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను ఎంచుకున్నారు. చిత్ర దర్శకుడు శివాజీ డాన్స్‌మాస్టర్‌గా పరిచయం ఉందని, దర్శకునిగా మంచి కథను ఎంపిక చేసుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నటుడు సుమన్ మాట్లాడుతూ- దర్శకుడు శివాజీ ఎంతో శ్రమపడి చిత్రాన్ని ఆద్యంతం రమణీయంగా తీర్చిదిద్దారు అన్నారు. చిత్ర నిర్మాత జి.వి.వి.గిరి మాట్లాడుతూ- చిత్ర నిర్మాణంలో వెన్నంటి వుండి పూర్తి సహకారాన్ని అందించిన సుమన్‌ని ఎప్పటికీ మరువలేము. హీరోగా యోగేశ్వర్ పాత్రను అర్థం చేసుకుని నటించాడు. ఒక పాట మినహా సినిమా పూర్తయింది అన్నారు.