జూలైలో తిక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి ధరమ్‌తేజ్, లారిసా బోనేసి జంటగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహన్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్ర విశేషాలు తెలపడానికి యూనిట్ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రోహన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, సినిమా 70 శాతం పూర్తయిందని, మలేసియాలో కొంత భాగాన్ని షూట్ చేయబోతున్నామని, ఇంకా మూడు పాటలు బ్యాలెన్స్ వున్నాయని, జూన్ మూడవ వారంలో ఆడియో విడుదల చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తామన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, మంచి కథతో తెరకెక్కే ఈ సినిమా రిలీజ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అన్నారు. దర్శకుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ, మే నెలలో షూటింగ్ పూర్తిచేసి తొందరలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని, సినిమా బాగా వస్తోందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:కె.వి.గుహన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, నిర్మాత:రోహన్‌కుమార్‌రెడ్డి, దర్శకత్వం:సునీల్‌రెడ్డి.