ఎమోషనల్ కామ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో స్టూడెంట్ నాయకుడిగా విజయ్ దేవరకొండ చేసే ఫైట్స్, రష్మికతో రొమాంటిక్ సన్నివేశాలు నేచురల్‌గా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను మే 31న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.