హూందాగా మసలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసీ నుంచి అధ్యక్షుడి వరకూ వివిధ హోదాల్లో పని చేసి అనుబంధం పెంచుకున్న తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పని చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. కొద్దిరోజుల క్రితం జరిగిన మా ఎన్నికల్లో సీనియర్ నరేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాము ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకుంటే, శివాజీరాజా అడ్డుపడుతున్నారన్న అభియోగాలతో నరేష్ మీడియా సమావేశం నిర్వహించటం తెలిసిందే. దీనిపై స్పందించిన శివాజీ రాజా మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇతరులను బాధపెడుతూ వ్యాఖ్యలు చేయడం నరేశ్ మానుకోవాలని హితవు పలుకుతూ, ‘మా’ పరువును రోడ్డుమీదకు లాగొద్దని సూచించారు. ఎన్నికలు పూరె్తైన తరువాత హూందాగా వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ఈసీ నుంచి ప్రసిడెంట్ వరకూ 22ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేసిన తాను, మా సొమ్ముతో టీ కూడా తాగలేదన్నారు. ‘మా’ రూల్స్ ప్రకారం మార్చిలో ఎన్నికలు జరిగితే, ఏప్రిల్ 1న కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, ఆ రూల్స్‌ను ఉల్లంఘిస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. రూల్స్ ఉల్లంఘించే నిర్ణయాలు తీసుకుంటూ ఎదుటివాళ్లపై అభియోగాలు మోపడం దారుణమన్నారు. నెగ్గిన తరువాత ప్రవర్తన హూందాగా ఉండాలని, వాళ్లకు ఏం అవసరమోచ్చినా తాను ముందుంటానన్న విషయాన్ని గ్రహించాలన్నారు. నడిగర్ సంఘం ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమం కోసం మేమంతా మలేషియా వెళ్లినపుడు తామంతా సాధారణ గదుల్లో బసచేస్తే, నరేశ్ ఖరీదైన గదిని బుక్ చేసుకున్నారని, అప్పుడు మా సొమ్ము దుర్వినియోగమవుతున్న విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ‘అధ్యక్షుడిగా గెలిచారు. అభివృద్ధిపై దృష్టిపెట్టండి. వ్యక్తులను బాధపెట్టి ప్రశాంతంగా పని చేసుకోలేరు. పాజిటివ్‌గా ఆలోచించండి. 2.9 కోట్ల ‘మా’ ఆస్తిని ఐదు కోట్లకు పెంచాను. మీరు దాన్ని రెట్టింపు చేయాలన్న కసిని చూపించండి’ అని హితవు పలికారు. ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినపుడు -ఆయన నాకు 30ఏళ్ల స్నేహితుడు. మాట్లాడటానికి ఇది వేదిక కాదు. కాకపోతే, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’ అన్నారు. ఏటా మా కోసం రూపొందించే డైరీ బాధ్యతలు ఈసారి నరేశ్‌కు అప్పగించామని, డైరీల ద్వారా 14.2 లక్షల ఆదాయం వస్తే, అకౌంట్‌లో పడింది కేవలం ఏడు లక్షలేనని గుర్తు చేశారు. మిగతా సొమ్ముకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంది కనుక, ఆ సొమ్మును అకౌంట్‌లోకి జమ చేసిన తరువాతే అధ్యక్షుడిగా నరేశ్ బాధ్యతలు స్వీకరిస్తే గౌరవప్రదంగా ఉంటుందన్నారు.