మెగా ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ళ క్రితం టాలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్ జోరును చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంవేసేది. వరసగా టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు సాధించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ వరస ఫ్లాపులు తన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. మరోవైపు తమిళ... హిందీ చిత్రాలను ఎక్కువగా యాక్సెప్ట్ చేయడంతో తెలుగు ఆఫర్లు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు స్లోగా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది రకుల్. మెగా హీరో సాయిధరమ్‌తేజ్ నెక్స్ట్ ప్రాజెక్‌టలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ పేరును పరిశీలిస్తున్నారట. తేజు ప్రస్తుతం ‘చిత్రలహరి’ చేస్తున్నాడు. దీని తర్వాతి ప్రాజెక్టు కోసం మారుతితో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుపుకుంటున్న చిత్రాన్ని సమ్మర్‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొదట తేజు సరసన రష్మికమందన్న పేరుని పరిశీలించినా తన బిజీ షెడ్యూల్ కారణంగా కుదరడం లేదట. అందుకే రకుల్‌ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకుందామని డిసైడ్ అయ్యారట. అంతా అనుకున్నట్టు జరిగితే సాయిధరమ్‌తేజ్- రకుల్ జోడీ ఫిక్స్ అయినట్టేనని సమాచారం.