ఉగాదికి ‘ప్రేమకథా చిత్రమ్-2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సుదర్శన్‌రెడ్డి సారథ్యంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ -ప్రేమకథాచిత్రమ్ 2. హరికిషన్ దర్శకుడు. సుమంత్ అశ్విన్, సిద్ధిఇద్నాని జంటగా నటిస్తుంటే, నందిత శే్వత లీడ్‌రోల్ చేస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమకథాచిత్రమ్ ఎంతటి ఘన విజయం సాధించిందో, సీక్వెల్‌కూ అంతే ఆదరణ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నామని అంటున్నారు నిర్మాత సుదర్శన్ రెడ్డి. చిత్రంలో విధ్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రమ్-2 అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.