పూర్తయిన సిద్ధార్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె.నాయుడు హీరోగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మలేసియా, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వైవిధ్యమైన కథనంతో సాగే ఈ చిత్రంలో హీరో పవర్‌ఫుల్‌గా నటించారని, నాలుగు పాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. ఈ చిత్రానికి కథ:విసు, కెమెరా:ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం:మణిశర్మ, పాటలు:అనంత్ శ్రీరామ్, మాటలు:పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, నిర్మాత:దాసరి కిరణ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దయానందరెడ్డి.