ఓన్లీ నేను... నాట్ ఎలోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కడమ్ స్టోరీస్ బ్యానర్‌పై సర్కడమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓన్లీ నేను. పూర్వి టక్కర్, చింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని శేషగిరిరావు నిర్మిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రేమ, ఫ్యామిలీ, కామెడీ.. కామన్‌గా వచ్చే కథలు. బేసిక్‌గా నేను వ్యాపారవేత్తని. కొంతమంది పెద్దవాళ్ల సలహామేర నేను సర్కడమ్ స్టోరీస్ అనే బ్యానర్ పెట్టా. ఈ చిత్ర కథాంశం ప్రపంచం మొత్తంలో టాప్‌టెన్ బిలియనీర్స్‌లో మహిళలు లేకపోవడం అనే అంశంపై కథ. అందమైన తెలివైన అమ్మాయికి కలిగిన బాధ. ‘ఎక్కడుంది ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్.. నేనెందుకు ఆ స్థానంలో ఉండకూడదు’ అన్నదే ఆ అమ్మాయి గోల్. అందులో భాగంగానే స్నేహితురాలిని సైతం చంపడానికి వెనకాడదు. ఈ సర్కడమ్ స్టోరీస్ బ్యానర్ తరఫున అఫీషియల్‌గా ట్రైలర్‌ను విడుదల చేశాం. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత శేషగిరిరావు మాట్లాడుతూ ఈ సినిమాతో శ్రీనివాస్‌తో భాగస్వామ్యమవ్వడం హ్యాపీగా ఉంది. డిసెంబర్ 6కి సినిమా పూర్తవుతుంది. కథ ఫ్రెష్‌గా ఉంటుంది అన్నారు. హీరో చింగ్ మాట్లాడుతూ నేనొక లాయర్‌ని. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ పూర్వీటక్కర్ మాట్లాడుతూ దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి గతంలో చాలా ప్రాజెక్ట్‌లకు పనిచేశాను. ఈ ప్రాజెక్టులో మంచి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా విడుదల కోసం ఆత్రంగా చూస్తున్నా’ అన్నారు.