విలనీ షేడ్స్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ భామ తమన్నా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆమధ్య చేసిన అభినేత్రి ఫ్లాప్‌తో అవకాశాలు తగ్గడంతో కాస్త డల్ అయిన తమ్మూ, లేటెస్టుగా ఎఫ్-2 సంచలన విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇంతవరకూ తమన్నా అభిమానులు కోరుకున్నట్టే గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చింది. అయితే పెరుగుతున్న పోటీ కారణంగా కొంతకాలం ఆమె తన రూటు మార్చింది. ఈ నేపథ్యంలో హారర్ సినిమానూ చేసేసింది. తాజాగా ఆమె నెగెటివ్ రోల్ చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. గతంలో విశాల్ సరసన కత్తి సందై చేసిన తమన్నా, ఆయన తాజా చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయడానికి సిద్ధమవుతోందట. సుందర్ సి దర్శకత్వం వహించనున్న యాక్షన్ థ్రిల్లర్‌లో కథానాయికగా మలయాళ నాయిక ఐశ్వర్యలక్ష్మి కనిపించనుందట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న సినిమా ఏప్రిల్ చివరి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి నెగెటివ్ పాత్రలో తమన్నా విశ్వరూపం ఎలా వుంటుందో చూడాలి!