వెరీ పవర్‌ఫుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోద రంగానికి సంబంధించి గ్లోబల్ ఐకాన్ అందించే అరుదైన గౌరవాన్ని ప్రియాంకా చోప్రా అందుకోబోతోంది. ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన 50మంది మహిళల జాబితాలో చోప్రా చోటు దక్కించుకుంది. విమెన్ ఇన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాను ఇటీవలే ప్రకటించారు. జాబితాలో అమెరికన్ స్టార్స్ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్ స్ట్రీప్‌లతోపాటు ప్రియాంక చోటు సంపాదించింది. న్యూయార్క్‌లో ఏప్రిల్ 10-12మధ్య నిర్వహించే వేడుకలో ప్రియాంక ఈ గౌరవం అందుకోనుంది. ఈ విషయమై ప్రియాంక ఆనందం వ్యక్తం చేస్తూ ‘ఇది నా అదృష్టం. సవాళ్లను ఎదుర్కొంటూ, సొంతంగా తమదైన మార్గం ఏర్పర్చుకుని కెరీర్‌లో ముందుకెళ్తున్న ప్రభావవంతమైన మహిళల సరసన నాపేరు ఉండటం అదృష్టంగానే భావిస్తన్నా’ అంటూ ట్వీట్ చేసింది. తాజాగా ప్రియాంక ‘ది స్కై ఈజ్ పింక్’లో నటిస్తోంది. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు.
ఇదిలావుంటే, బాలీవుడ్ నటి ఆదితిరావు హైదరి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019గా ఎంపికైంది. తొలిస్థానం ఆదితికి దక్కితే, రెండో స్థానంలో ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా 2018 శ్రీయారావు నిలిచింది. బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో వరసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న అదితిరావు హైదరి, ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా వుంది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూపు తయారు చేసిన జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017లో తొలిస్థానం దక్కించుకున్న పూజాహెగ్డేకి ఈసారి నాలుగో స్థానం మాత్రమే దక్కింది. ఐదు రష్మి, ఎనిమిది కైరా అద్వానీ, తొమ్మిది రకుల్, పదో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచారు.