అందుకు ఆపేశారు.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడు కమల్-క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘్భరతీయుడు-2’ ఆగిపోయిందన్న కథనాలు ఆమధ్య వినిపించాయి. బడ్జెట్ విషయమై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో దర్శకుడు శంకర్‌కు పొసగకపోవడంతో సినిమా ఆగిపోయిందన్నది ఆ కథనాలకు కారణంగానూ వినిపించింది. సంగీత దర్శకుడిగా రెహమాన్‌ను పక్కన పెట్టడం కూడా శంకర్‌కు రుచించలేదనీ కొన్నాళ్లు వినిపించింది. ఇన్ని కథనాలు వెలువడినా -అధికారిక స్పష్టత రాలేదు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో విషయం బయటికొచ్చింది. సినిమాలో మేకప్ కారణంగా కమల్ అలెర్జీతో ఇబ్బంది పడుతున్నాడన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొంతకాలం గ్యాప్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, ప్రాజెక్టుకు తాత్కాలికంగా విరామం ఇచ్చారని అంటున్నారు. సినిమా మొత్తం కమల్ వృద్ధుడి గెటప్‌లోనే ఉండాల్సి రావడం, ఎక్కువసేపు మేకప్‌తోవుంటే అలెర్జీ ఎక్కువయ్యే ప్రమాదముందని చిత్రబృందం భావించిన కారణంగానే షూటింగ్ నిలిపివేశారని అంటున్నారు. దాదాపు 20ఏళ్ల తరువాత కమల్, శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం భారతీయుడు-2 కావడంతో, ప్రకటించిన టైంలోనే భారీగా అంచనాలు వెలువడ్డాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంటే, వెనె్నల కిశోర్ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.