శాటిలైట్ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో విజయ్ 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అట్లీకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో సాగే కథ. కోచ్ పాత్రలో విజయ్ కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే. గతంలో అట్లీ -విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తెరి, మెర్సల్ చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. అందువల్ల ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారణంగా సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో ఛానళ్ల మధ్య గట్టి పోటీ నడిచిందట. చివరికు సన్ టీవీ భారీ రేటుకు శాటిలైట్ హక్కులు దక్కించుకున్నట్టు సమాచారం. శాటిలైట్ హక్కులపరంగా కోలీవుడ్‌లో ఇంతవరకూ అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన సినిమా ఇదేననే టాక్ వినిపిస్తుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారట.