శంకర్‌తో మళ్లీ రజని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి శంకర్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడట? పాత కాంబినేషన్‌లో కొత్త సినిమా వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. వీళ్ల కాంబినేషన్‌లో శివాజీ, రోబో, 2.0 ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీ రాజకీయాలతో బిజీ అవుతాడనుకున్నారు. కానీ వరుసగా సినిమాలు చేయడానికే రెడీ అయ్యాడట. దాంతో శంకర్.. రజనీ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రజనీ ఒక సినిమా చేస్తున్నాడు. తరువాత సినిమాను శంకర్‌తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని టాక్. ఈ సినిమాను రజనీ చివరి సినిమాగా ప్రకటించే అవకాశాలూ లేకపోలేదట. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.