అల్లుకు తల్లిగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోల రేసులో ఒకింత వెనకపడిన అల్లు అర్జున్ -చివరకు త్రివిక్రమ్ ప్రాజెక్టుకు ఓకే చేయడం తెలిసిందే. క్లాసిక్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసే త్రివిక్రమ్ -ఈసారి కొంచెం మాస్ యాక్షన్, ఎమోషన్ టచ్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌ని బన్నీ కోసం డిజైన్ చేశాడని అంటున్నారు. ప్రీప్రొడక్షన్స్ పూర్తి చేసి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన సన్నాహాలు మొదలయ్యాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మొదలయ్యే రెగ్యులర్ షూట్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్టులోకి తమిళ నటుడు సత్యరాజ్, మలయాళ నటుడు జయరామ్, తెలుగు నుంచి రాజేంద్రప్రసాద్, రావురమేష్, సీనియర్ నరేశ్‌లను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, మరో ముఖ్య పాత్ర కోసం అందాల టబును సంప్రదిస్తున్నట్టు సమాచారం. బన్నీ తల్లిగా ప్రాధాన్యత కలిగిన పాత్రలో సీనియర్ హీరోయిన్ టబును చూపించాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు నదియా, ఖుష్బూలను తీసుకొచ్చిన త్రివిక్రమ్‌కు, టబు క్లియరెన్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. సో, అల్లు తల్లిగా టబును స్క్రీన్‌మీద చూడొచ్చన్నమాట.