నేను రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ మరో కొత్త చిత్రానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’గా తెరకెక్కుతున్న చిత్రంతో బిజీ అయిన నితిన్, మరో కొత్త చిత్రాన్నీ ఓకే చేశాడు. భీష్మలో నితిన్‌తో రష్మిక మందన జోడీ కడుతోంది. కొద్దిరోజుల్లో కొత్త సినిమాల ప్రకటన చేస్తానని ఈమధ్యే అభిమానులకు ప్రామిస్ చేసిన నితిన్, అన్నట్టుగానే రెండో చిత్రాన్నీ ప్రకటించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్రపసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ ఏలేటి కొత్త చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్ రెండోవారంలో షూటింగ్ మొదలుపెట్టనున్న చిత్రాన్ని వైవిధ్యమైన కథతో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు.
ఆరేళ్ల క్రితం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం తరువాత నితిన్ రేంజ్‌ని పెంచే ఒక్క సినిమా పడలేదు. మధ్యలో త్రివిక్రమ్‌తో చేసిన ‘అఆ’ తప్ప, వరుసగా ఆరేడు చిత్రాలు నితిన్‌కు నిరుత్సాహాన్నిచ్చాయి. హార్ట్‌అటాక్ దగ్గరినుంచి చిన్నదాన నీకోసం, కొరియర్ బోయ్ కల్యాణ్, లై, చల్‌మోహనరంగ, ఆ తరువాత వచ్చిన శ్రీనివాస కల్యాణం వరకూ -హీరోగా నితిన్ కెరీర్‌కు ఉపయోగపడే చిత్రాలు కాలేకపోయాయి. దీంతో కొత్త చిత్రాలను వెంటనే ప్రకటించకుండా కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ -‘భీష్మ’పై పెద్ద ఆశలే పెట్టుకున్నాడు.