24న అబ్బాయితో అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పాలక్ లల్వాని జంటగా జి.జె.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జెక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ, తొమ్మిది నెలలుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నామని, సినిమా పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. రీరికార్డింగ్ సమయంలో ఇళయరాజాకు ఈ చిత్రం నచ్చిందని, ఇటువంటి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ వచ్చి చాలా రోజులైందని ఆయన చెప్పడం విశేషమని తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోనున్న ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇళయరాజా ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విడుదల చేయమని అన్నారని, త్వరలో ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. సినిమా మొదటినుండీ చివరివరకూ అందరికీ నచ్చేలా సాగుతుందని, ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని కథానాయకుడు నాగశౌర్య అన్నారు. అనుకున్నదానికన్నా ఎక్కువ బడ్జెట్‌లోనే ఈ చిత్రం రూపొందిందని, క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రమేష్ వర్మ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:శ్యామ్ కె నాయుడు, సంగీతం:ఇళయరాజా, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రెహమాన్, దర్శకత్వం:రమేష్ వర్మ.