తంత్రం యంత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రదీప్, ధీరేంద్ర, కిరణ్, సాయితేజ, అంబేద్కర్, మమత ప్రధాన పాత్రలుగా తార, నీలు కోఆపరేషన్ బ్యానర్ పతాకంపై ఎం.ఎస్.బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మంత్రం తంత్రం యంత్రం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, వరంగల్ ఎం.పి. దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, గీత రచయిత చంద్రబోస్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక నిర్మాత ఎం.ఎస్.బాబు మాట్లాడుతూ, పాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన తాను ఈ రోజు ఈ స్థాయిలో వుండడానికి కారణం దాసరి నారాయణరావేనని, ‘గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్’ తరువాత చేస్తున్న మరో చిత్రం ఇదని అన్నారు. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు కలగలపి రూపొందించే ఈ సినిమా ఈనెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తామన్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ, కన్నడంలో చాలా చిత్రాల్లో నటించానని. తెలుగులో ‘పంచముఖి’, ‘కాలింగ్‌బెల్’ చిత్రాలు చేశానని, ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని, నటనకు మంచి ప్రాధాన్యత వుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:గిరి దోసాడ, ఎడిటింగ్:ఉపేంద్ర, కథ:మహేశ్వర్, సహ నిర్మాతలు:అంబాల రవి, మోతె ప్రకాష్‌రెడ్డి, ఎన్.అప్సర, ఎస్.కె.మక్బుల్, సమర్పణ:ఆర్మాన్, సంగీతం, నిర్మాత, దర్శకత్వం:ఎం.ఎస్.బాబు.