నమ్మిందే.. తీశాను!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను తెలుసుకున్నదీ, శోధనలో అవగాహనకొచ్చినదీ కలిపి నేను నమ్మిన నిజాన్ని చెప్పాను. ‘ఇది కరెక్ట్ కాద’ని ఎవరికైనా అనిపిస్తే, అలా భావించినవాళ్లు వాళ్లకు తెలిసింది సినిమా తీసుకోవచ్చు. ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు’ అంటున్నాడు రాంగోపాల్ వర్మ. జీవీ ఫిలింస్ సమర్పణలో రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగారి నిర్మాతలుగా అగస్త్య మంజుతో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ 29న సినిమా విడుదలవుతున్న సందర్భంలో రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ

* మాఫియా సినిమాల
టైంలోలేని వివాదాలు ఇప్పుడెందుకు?
-నిజాలంటే భయం. అవి బయటపడుతున్నాయని భయం. అందుకే వివాదాలు తలెత్తుతున్నాయి. సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
* లక్ష్మీ పార్వతినే
నటింపచేస్తే సరిపోయేదేమో?
-పాతికేళ్ల క్రితంనాటి కథ. ఇప్పుడు ఆవిడ వయస్సు అంత కాదు.
* లక్ష్మీపార్వతి పాయింట్
ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందా?
-లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా కాదు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించిన సమయం నుంచీ సినిమా.
* చంద్రబాబు పాయింట్
ఆఫ్ వ్యూలో ఆయనకు ఆయన కరెక్టేగా?
-కావొచ్చు. అంతగా నమ్మినప్పుడు ఆయనే సినిమా తీసుకోవచ్చు.
* నాదెండ్ల.. నారా? ఎవరు పెద్ద కుట్రదారు?
-చంద్రబాబు చేసిందే. నాదెండ్ల చేసింది పార్టీ కోసం. రక్తసంబంధీకులే కుట్ర చేయడం దారుణం.
* స్టార్స్‌తో ఎందుకు చేయలేదు?
-ఇమేజ్‌లేని రియలిస్టిక్ క్యారెక్టర్లపట్ల ఆడియన్స్‌కి బిలీవిబిలిటీ ఉంటుంది. అందుకే.
* వైకాపాకు సపోర్ట్‌గా,
తెదేపాకు వ్యతిరేకంగా తీశారన్న చర్చ ఉంది?
-తప్పు. అయినా, మనం ఎంత చెప్పినా, అవతలివాడు ఏదనుకుంటే అదే నమ్ముతాడు. ఈ నిర్మాత వైకాపా అని ముందు నాకు తెలీదు. తెలిసినా కాదనేవాడిని కాదు. ఇక్కడ పాయింట్, మేకర్‌గా పాతికేళ్ల క్రితం కథనే నేను చేశా. అప్పటి కథ అంటే -ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చుగానీ, వైకాపాకు అనుకూలంగా ఉండదుగా.
* ఇందులో నాదెండ్ల ఎపిసోడ్?
- ఇది కేవలం లక్ష్మీస్ కథేనండి. 1989నాటిది.
* విజయ్‌కుమార్ ఎన్టీఆర్ పాత్రలోకి మారిన పద్ధతి ఎలా అనిపించింది?
-ఎన్టీఆర్‌ని సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ ఆయన లివింగ్ రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో వ్యవహరించిన తీరు పట్టుకోవాలంటే ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్‌ను కేప్చర్ చేయాలి. దాన్ని ఆయన బాగా చేశారు.
* చంద్రబాబు, ఆయన ప్రభుత్వం
మీద కసితోనే చేశారంటున్నారు?
- నాకు సీబియన్ వల్ల నష్టంలేదు. జగన్‌వల్ల లాభం లేదు. వైస్రాయ్ ఘటనల టైంలో నేను రంగీలా తీశా. అప్పుడు సోషల్ మీడియా లేక పెద్ద ఐడియా లేదు. కానీ బాలకృష్ణ నా దగ్గరకు వచ్చినపుడు ‘కథానాయకుడు’ సినిమాతోనే ఇది మొదలైంది. అందుకే నేను ఈ సినిమాను బాలకృష్ణకు అంకితమిస్తున్నా. నన్ను ఆయన కలిశారు. ఆయన నన్ను కలవలేదంటే ఆయనన్నా అబద్ధమై ఉండాలి. నేను చెప్పేదైనా అబద్ధమై ఉండాలి.
* కాంట్రొవర్సీలు చూశారు. ఇలా బాలీవుడ్‌లో చేయడం కష్టమా? ఇక్కడ కష్టమా?
-ఎక్కడా కాదు. లీగల్‌గా కరెక్ట్‌గా చేస్తున్నపుడు డెమోక్రాటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు.
* కాంట్రావర్సీ పబ్లిసిటీ వ్యసనమైందట?
-నాకు చాలా వ్యసనాలున్నాయి. ఇది కూడా అన్నా ఓకే. కెరీర్‌లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్సీలనే తీసుకున్నా. సర్కార్, వంగవీటి, రక్తచరిత్ర ఏదైనా చూడండి.
* ఈ సినిమా కెరీర్‌లో ప్రత్యేకమన్నారు?
-ప్రపంచ చరిత్రలో ఎన్టీఆర్‌కంటే ప్రముఖ తెలుగువాడుండడు. అలాంటి వ్యక్తికి జరిగిన ఎక్స్‌ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్. ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా రెస్పాన్సుబిలిటీ. ట్రూత్‌ఫుల్ టు హిమ్ అనేది చాలా కీలకం.
* వైస్రాయ్.. చాలామందికి తెలుసుగా?
-తెలుసు. దానికి దారితీసిన కారణాలు తెలీదు.
* సెన్సార్‌వల్ల ఇబ్బందులు?
- ఉండవండి. నేను రూల్స్‌మేరకే చేశా.