సస్పెన్స్ థ్రిల్లర్‌గా అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్, చరణ్‌దీప్ ముఖ్యపాత్రల్లో జి.ఎస్.ఎస్.పి.కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అంతం’. రాంగోపాల్‌వర్మకు వీరాభిమానిని కావడంతో ఈ టైటిల్ పెట్టానని అంటున్నాడు దర్శక నిర్మాత. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కల్యాణ్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దాంతోపాటు ఆమె నటన కూడా అందరికీ నచ్చేలా వుంటుందని అన్నారు. వర్మగారి అంతం చిత్రం గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తరహాలో ఈ కథ కూడా సాగుతుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నామన్నారు. సంగీతం:కార్తీక్ రోడ్రిగ్జ్, యాక్షన్:రామ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.లక్ష్మీపతిరావు, బి.వేణు, నిర్మాత, దర్శకత్వం:జి.ఎస్.ఎస్.పి.కల్యాణ్.