వీడో పెద్ద.. కోతలరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్ దర్శకత్వంలో శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషాదోషి హీరో హీరోయిన్లుగా ఏఎస్‌కె ఫిలింస్ పతాకంపై ఎ సదానందకిషోర్, కోలన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కోతలరాయుడు. పాటలువినా చిత్రం షూటింగ్ పూరె్తైంది. ఈ సందర్భంగా కోతలరాయుడు వివరాలను చిత్రబృందం మీడియాకు అందించింది. దర్శకుడు సుధీర్ మాట్లాడుతూ శ్రీకాంత్ కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలున్నాయి, వాటికోవకు కోతలరాయుడు కూడా చేరుతుంది అన్నారు. శ్రీకాంత్ స్టైలిష్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత సహకరించారని, సంగీత దర్శకుడు డిజె వసంత్ మంచి సంగీతం సమకూరిస్తే, కెమెరామేన్ బుజ్జి అద్భుత ప్రొటోగ్రఫీ నైపుణ్యాన్ని చూపించారన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ కోతలరాయుడు చిత్రంలో ఫ్యామిలీని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తున్నానని, సినిమాను దర్శకుడు సుధీర్ అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. సినిమాలో ప్రాచీసిన్హా, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, చంద్రమోహన్, సుధ, హేమ, సత్యం రాజేష్, బిత్తిరి సత్తి తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు.